Poco C71: 6.88 HD+ LCD డిస్‌ప్లే, భారీ బ్యాటరీ వంటి బ్లాక్‌బస్టర్ ఫీచర్లతో పోకో C71.. కేవలం ₹6,499కే.! 5 d ago

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో తన సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Poco C71 ని భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేసింది. తక్కువ ధరలో ఆకర్షణీయమైన డిజైను, శక్తివంతమైన పనితీరు.. అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోన్ మధ్యతరగతి కుటుంబాలను ఆకర్షిస్తూ.. మార్కెట్లో మంచి ఫోన్ గా నిలవనుంది. కేవలం రూ.7 వేలకే ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. తక్కువ ధరకే వస్తుందని.. ఏదో పిచ్చి ఫోన్ అనుకోకండి.. 6.88-అంగుళాల పెద్ద డిస్‌ప్లే.... వెట్ టచ్ సపోర్ట్, TUV రైన్‌ల్యాండ్ కంటి రక్షణ వంటి సర్టిఫికేషన్‌లతో వస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే.. ఇది Android v15 తో వస్తుంది. ఒకసారి ఈ ఫోన్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం రండి.!
Poco C71 ఫీచర్లు:
ప్రాసెసర్: UniSoC T7250 SoC
డిస్‌ప్లే: 6.88 HD+ LCD స్క్రీన్
రిఫ్రెష్ రేట్: 120Hz
బ్యాటరీ: 5200mAh
ఛార్జింగ్: 15W ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ v15
కాన్ఫిగరేషన్:
4GB RAM + 64GB స్టోరేజ్
6GB RAM + 128GB స్టోరేజ్
కెమెరా ఫీచర్లు:
బ్యాక్ కెమెరా: 32MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 8MP
కనెక్టివిటీ ఫీచర్లు:
- బ్లూటూత్ 5.2
- USB టైప్-C పోర్ట్
- Wi-Fi (2.4GHz/5GHz)
- 4G డ్యూయల్ సిమ్
కలర్ ఆప్షన్స్:
- పవర్ బ్లాక్
- డెసర్ట్ గోల్డ్
- కూల్ బ్లూ
ఫోన్ ధర:
4GB RAM, 64GB స్టోరేజ్ -- రూ. 6,499/-
6GB RAM, 128GB స్టోరేజ్ -- రూ. 7,499/-
ప్లస్ పాయింట్స్:
- స్మూత్ డిస్‌ప్లే
- AI కెమెరా
- IP52 ధూళి మరియు నీటి నిరోధకత
- బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంది
మైనస్ పాయింట్స్:
- నెమ్మదైన 15W ఛార్జింగ్
- 5G నెట్‌వర్క్ లేదు
- NFC లేదు
Poco C71 ఫోన్‌లో ధరను మించిన ఫీచర్లు ఉన్నాయి. ప్రత్యేకంగా 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇది సాధారణ ఉపయోగానికి.. రోజువారీ అవసరాలకు ఒక మంచి బడ్జెట్- ఫ్రెండ్లీ ఫోన్. నెమ్మదైన ఛార్జింగ్, 5G సపోర్ట్ లేకపోవడం వంటి పరిమితులు ఉన్నప్పటికీ.. ఈ ఫోన్ ₹6,499 ప్రారంభ ధరతో లభిస్తూ మార్కెట్‌లో మంచి స్పందనను పొందుతోంది. తక్కువ ధరలో అత్యాధునిక ఫీచర్లను కోరుకునే వినియోగదారులకు ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో ఏప్రిల్ 8వ తేదీ నుండి అందుబాటులోకి రానుంది.
ఇది చదవండి: రూ.25 వేల లోపు.. 80W ఛార్జింగ్‌తో ప్రీమియం డిస్‌ప్లే.!